
న్యూఢిల్లీ: గత రెండున్నరేళ్లలో రూ.2,567 కోట్ల విలువైన చేనేత ప్రొడక్ట్‌లను కాశ్మీర్ ఎగుమతి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3 వేల కోట్ల విలువైన ప్రొడక్ట్‌లు ఎగుమతి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో పాపులర్ అయిన కాశ్మీరీ చేనేత ప్రొడక్ట్‌లు ఎగుమతి అయ్యాయని వివరించారు.
కాశ్మీరీ హ్యాండీక్రాఫ్ట్, హ్యండ్లూమ్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, రూ.1,105 కోట్ల విలువైన కాణి, సోజ్నీ శాలువాలు, రూ.728 కోట్ల విలువైన చేతితో చేసిన కార్పెట్‌లు గత మూడేళ్లలో ఎగుమతి అయ్యాయి. కాగా, ఎగుమతిదారులకు ప్రభుత్వం వివిధ రాయితీలు ఇస్తోంది.