సెల్ఫోన్..ఇది ప్రతి మనిషి నిత్యజీవితంలో ఓభాగమైంది. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది సెల్ఫోన్ వాడుతున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో సెల్ ఫోన్ లేకుండా జరిగే పనేలేదు. అటువంటి సెల్ ఫోన్ ఛార్జింగ్ విషయంలో మనం చాలాసార్లు సమస్యలు ఎదుర్కొంటాం. ఛార్జింగ్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతుంటాం. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఇది చాలా క్లిష్టపరిస్థితి. మరీ సెల్ ఫోన్ ఛార్జింగ్ సమస్యలేకుండా బ్యాటరీ లైఫ్ ను కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం గురించి తెలుసుకుందాం.
ఫోన్ ఎంత శాతం ఛార్జ్ చేయాలి.. ఫోన్ ను ఎప్పుడు ఛార్జ్ చేయాలి అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఫోన్ ని పదే పదే ఛార్జింగ్ లో పెట్టేవారు చాలా మంది ఉన్నారు. కానీ అలా చేయడం బ్యాటరీ లైఫ్ కి ప్రమాదకరం. ఫోన్ అవసరం ఎంతలా అంటే దాని బ్యాటరీ ఎప్పటికీ తగ్గకూడదని ప్రజలు కోరుకునేస్థాయికి పెరిగింది. ఫోన్ లోని అధునాతన ఫీచర్లు వినియోగం పెరిగడంతో మొబైల్ బ్యాటరీ కొంచెం తక్కువ అనిపించినా పదే పదే ఛార్జింగ్ లో పెట్టేవారు చాలామందే ఉన్నారు. అయితే అలా చేయడం సరైనదేనా? ఫోన్ ను ఎంతశాతం ఛార్జింగ్ లో పెట్టాలో తెలిసిన వారు చాలామంది ఉంటారు.
అలాంటి వారికోసం కొన్ని మార్గాలు. మీ ఫోన్ బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటో తెలుసా.. మొబైల్ ఫోన్ ను దాదాపు 20 శాతం ఛార్జింగ్ ఉన్నపుడు ప్లగ్ ఇన్ చేసి 80-90 శాతం వరకు ఛార్జ్ చేయడం.. సో మర్చిపోకండి.