ఈయూడీఆర్​కు అనుగుణంగా హంగల్ ఉత్పత్తులు

ఈయూడీఆర్​కు అనుగుణంగా హంగల్ ఉత్పత్తులు

న్యూఢిల్లీ: తమ సరుకులన్నీ ఈయూ అటవీ నిర్మూలన నియంత్రణ (ఈయూడీఆర్)​ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా సస్టెయినబుల్​సప్లై చెయిన్​ సొల్యూషన్స్ ప్రొవైడర్ టీఆర్​ఎస్​టీ01తో కలిసి పని చేస్తున్నట్టు  హంగల్ కాఫీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది.  ఈయూడీఆర్​ వచ్చే ఏడాది జనవరి నుంచి వర్తిస్తుంది. ఇక నుంచి అటవీ నిర్మూలన ప్రాంతాల నుంచి తమ మార్కెట్లకు కాఫీ, కోకో, రబ్బరు, ఆయిల్ పామ్, సోయా,ఇతర వస్తువుల ఎగుమతులను నిషేధిస్తామని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది.

హంగల్ కాఫీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్టింగ్ భారతదేశంలో ఈయూడీఆర్​- కంప్లయంట్​ సొల్యూషన్ టీఆర్​ఎస్​టీ01 చైన్‌‌‌‌‌‌‌‌ను స్వీకరించిన మొదటి కంపెనీ అని సంస్థ వర్గాలు తెలిపాయి.  పరిశ్రమ అంచనాల ప్రకారం, యూరోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌కు భారతదేశం  కాఫీ ఎగుమతులు దాని మొత్తం కాఫీ ఎగుమతుల్లో దాదాపు 57 శాతం ఉంటాయి. మనదేశం సంవత్సరానికి రూ. 5,000 కోట్ల విలువైన కాఫీ ప్రొడక్టులను ఎగుమతి చేస్తుంది.