
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ ప్లేయర్లు జీవన్ నెడుంచెజియాన్–విజయ్ సుందర్ ప్రశాంత్.. హాంగ్జౌ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలిచారు. మంగళవారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో జీవన్–విజయ్ 4–6, 7–6 (5), 10–7తో కాన్‌స్టాంటిన్ ఫ్రాంట్జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ)పై గెలిచారు. గంటా 49 నిమిషాల మ్యాచ్‌లో ఇండియా జోడీ తొలి సెట్ ఓడినా తర్వాతి సెట్‌లో దీటుగా ఆడింది. కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో ఒత్తిడిని తట్టుకుని వరుసగా పాయింట్లు నెగ్గారు.
35 ఏళ్ల జీవన్ కెరీర్‌లో ఇది రెండో ఏటీపీ టైటిల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి చెన్నై ఓపెన్‌ను గెలిచాడు. విజయ్‌కు కెరీర్‌లో ఇది తొలి ఏటీపీ టైటిల్. మరోవైపు చెంగ్డౌ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో యూకీ భాంబ్రీ తన పార్ట్‌నర్ ఒలివెట్టి (ఫ్రాన్స్)తో కలిసి 4–6, 6–4, 4–10తో సాడియో డౌంబియా–ఫ్యాబియెన్ రీబౌల్ (ఫ్రాన్స్) చేతిలో ఓడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టాడు. దీంతో ఈ ఏడాది మూడో టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు.