గడపగడపకు బీజేపీతో పార్టీ బలోపేతం: ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్​అర్బన్, వెలుగు: బీజేపీ చేపట్టిన గడపగడపకు బీజేపీ కార్యక్రమంతో బూత్​స్థాయిలో పార్టీ బలోపేతమవుతోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 48వ డివిజన్​లో పర్యటించిన ఆయన, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పాంప్లెంట్స్​పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధన్​పాల్ ​మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతీ సంక్షేమ కార్యక్రమంలో  కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని, వాటి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నామన్నారు. కార్యక్రమంలో లీడర్లు మధు, రాంచందర్, భూపతి, సంజయ్, ప్రభాకర్, విజయ్​పాల్గొన్నారు.

ALSO READ:ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితి చూస్తాననుకోలె: జగ్గారెడ్డి

పిట్లం: కామారెడ్డి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్​ అరుణతార సోమవారం బిచ్కుంద మండలం గోపన్​పల్లిలో నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన స్టిక్కర్లు, పాంప్లెంట్స్​ను ఇంటింటికీ తిరిగి అందించారు.
ఆర్మూర్: బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్మూర్ మున్సిపల్​పరిధిలోని పెర్కిట్ లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పైడి రాకేశ్​రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని అందరూ గుర్తించాలన్నారు. ఆయన వెంట బీజేపీ టౌన్​ప్రెసిడెంట్​జెస్సు అనిల్ కుమార్ ఉన్నారు.