
తెలుగు హీరోయిన్ హన్సిక తన కుటుంబంతో కలసి తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చింది. ఇందులోభాగంగా భర్త, కుటుంబ సభ్యులతో కలసి తిరుమలేశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవ తి రాథోడ్, దయానంద్, ఎమ్మెల్యేలు అనిరూధ్ రెడ్డి, సత్యనారాయణ శ్రీ వారిని దర్శించుకున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీరికి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపం డితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్ర సాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో దేశముదురు, కంత్రీ, పాండవులు పాండవులు తుమ్మెద, మస్కా, కందిరీగ తదితర హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లయిన తర్వాత కూడా పలు ఫిమేల్ లీడ్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిచింది. కానీ ఈ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం రౌడీ బేబీ, గాంధారి, మ్యాన్ తదితర సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.