పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్ ప్రావీణ్య

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ/ పరకాల/ శాయంపేట (ఆత్మకూరు), వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతలు, పోలీస్, రవాణా తదితర శాఖల అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లుల యజమానులతో రివ్యూ చేశారు.

జిల్లాలో పత్తి రైతులు, పత్తి సాగు విస్తీర్ణం, కొనుగోళ్లకు సంబంధించిన ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ నెల మూడో వారం నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ అనురాధ, మిల్లుల యజమానులు  పాల్గొన్నారు. 

త్వరలోనే రెసిడెన్షియల్​స్కూల్​కు శంకుస్థాపన

పరకాలకు మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూలుకు త్వరలోనే ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ విలీన గ్రామం రాజిపేట శివారులోని 19ఎకరాల 34గుంటల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించగా, ఆమె పరిశీలించారు. అంతకుముందు పరకాల యానిమల్ బర్త్​ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్​ ఏర్పాటు చేసేందుకు పశు వైద్యశాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ భాస్కర్, పశుసంవర్ధక ఏడీ శ్రీనివాస్​ తదితరులున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆత్మకూరు మండల విద్యావనరుల కేంద్రంతోపాటు జడ్పీహెచ్​ఎస్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీరు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్, రికార్డులను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా, కలెక్టర్​ ఆదేశాల మబేరకు ఆత్మకూరులోని సర్వేనెంబర్ 791 ప్రభుత్వ భూమిని డీపీవో నాగపద్మజ పరిశీలించారు.