అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ధర్మసాగర్, వెలుగు: కుడా ప్రతిపాదించిన ఎకోటూరిజం పార్క్ ఏర్పాటు కోసం ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టలో స్థలం ఎంపికకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ కుడా ప్రతిపాదించిన ఎకో టూరిజం పార్క్ కోసం అటవీ, రెవెన్యూ, కుడా అధికారులు కలిసి స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు.

ఈ పార్క్ ఏర్పాటైతే ప్రజలకు, పిల్లలకు సంబంధించి కార్యక్రమాలు ఉంటాయని, హాట్ బెలూన్స్, వాటర్ స్పోర్ట్స్, రకరకాల పక్షులను చూడవచ్చన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య, అడిషనల్​ కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్, కుడా సీపీవో అజిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.