రంజాన్ మాసానికి ఏర్పాట్లు చేయండి : హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య

రంజాన్ మాసానికి ఏర్పాట్లు చేయండి : హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు: పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య సూచించారు. వచ్చే నెల 2 నుంచి రంజాన్​ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్​ రివ్యూ చేశారు. మసీదులను విద్యుత్తు దీపాలతో అలంకరించాలన్నారు. తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ జరగాలన్నారు.

ముస్లిం ఉద్యోగులకు గంట ముందు ఆఫీస్​ నుంచి వెళ్లేలా ప్రభుత్వ ఆదేశాలున్నాయని, 24 గంటల పాటు  దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. శుక్రవారం, ముఖ్యమైన రోజుల్లో మసీదుల వద్ద ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని, అవసరమైతే అంబులెన్స్ ను కూడా  సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.