హనుమకొండ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజనీర్ కాలేజీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.