జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలి

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలి

హనుమకొండ సిటీ, వెలుగు: ఈనెల 25న  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు నారాయణ, రాథోడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.