ఆంజనేయస్వామిపుట్టిన స్థలం ఎక్కడో తెలుసా..!

ఆంజనేయస్వామిపుట్టిన స్థలం ఎక్కడో తెలుసా..!

హనుమంతుడు వానర సంతతికి జన్మించాడు.  ఆయన తల్లి అంజనా దేవికి.. బృహస్పతికి ఇచ్చిన శాపం కారణంగా.. భూలోకానికి వచ్చి.. కేసరీనందుడు అనే వానరుడిని వివాహమాడి.. వాయుదేవుని అనుగ్రహంతో.. తిరుమలలో ఉన్న అంజనాద్రిపై జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.  ఏప్రిల్​ 12న హనుమాన్​ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మవృత్తాంతాన్ని తెలుసుకుందాం. . .

హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసం పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది.  పురాణాలు పండితులు .. ఆధ్యాత్మిక వేత్తలు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు ( ఏప్రిల్​ 12)  జయంతి.  హనుమాన్ చిరంజీవి ...ఇప్పటికే బ్రతికే ఉన్నారని భక్తులను ఓ కంట కనిపెడతారని అంటుంటారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే  దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కలియుగంలో ఆయన హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ..భక్తులను రక్షిస్తున్నాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12న వచ్చింది. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 గంటలకు ప్రారంభమవుతుంది. అదే టైంలో ఏప్రిల్ 13 న ఉదయం 5.52 గంటలకు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 12న హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.

►ALSO READ | ఆంజనేయుడికి ఇష్టమైన ఆహారం ఇదే.. వీటిని ప్రసాదంగా పెట్టండి.. మీరూ తినండి.. బలం, ధైర్యం వస్తాయి..!

హనుమంతుని జన్మోత్సవం చైత్రమాసం పౌర్ణమి రోజున   జరుపుకుంటారు. ఈ రోజున ( ఏప్రిల్​ 12)  హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.  హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడాడు. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును  ఓ పండు రూపములో అంజరాదేవికి ఇచ్చాడని శివపురాణంలో పేర్కొన్నారు.  అలా అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ..  వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు. 

 ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతము

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేసింది.   ఆమె   హావభావ వికారాలకు బృహస్పతి  ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు ..హనుమంతునికి...  జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఈ విషయాన్ని కంబరామాయణంలో  ఉంది.  ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" కి తిరుమల లోని అంజనాద్రి పై జన్మ ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. .

►ALSO READ | హనుమాన్​ జయంతి ( ఏప్రిల్​ 12)న ఇలా చేయండి.. శనిదోషం నుంచి విముక్తి.. ఆర్థిక కష్టాలు తీరతాయి..

హనుమాన్ జయంతికి మతపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును హనుమంతుడి జన్మదినంగా జరుపుకోవడమే కాదు హనుమంతుడిని స్మరించినా అన్ని కష్టాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఈ రోజు శివుని రుద్ర అవతారంగా పరిగణించబడే హనుమంతుడి జన్మదినంగా భావిస్తారు. చెడుపై మంచి విజయం సాధించడానికి, మత స్థాపన కోసం ఆయన జన్మించాడు. హనుమంతుడు రామునికి భక్తుడు. సీతారాముల పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి, అంకితభావం ఆయన భక్తులకు స్ఫూర్తినిస్తాయి. అందువల్ల హనుమాన్ జయంతి రోజు భక్తులకు ఆయన భక్తి నుంచి ప్రేరణ పొందే అవకాశాన్ని ఇస్తుంది.