టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (PrasanthVarma), హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్ (Hanuman). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం హనుమాన్ మూవీ అశేషమైన ప్రేక్షక ఆదరణతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రాబడుతోంది. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే..హనుమాన్ సీక్వెల్గా రానున్న జై హనుమాన్ (Jai hanuman) మూవీలో..హనుమంతుడు,రాముడు పాత్రల్లో ఎవరైతే బాగుంటుందో తన అభిప్రాయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
కాగా హనుమంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని చూసే అవకాశం ఉందని తెలుపగా..రాముడిగా మహేష్ బాబు(Mahesh Babu) చేస్తే బాగుంటుందని తన మనసులో మాటను వెల్లడించారు. అయితే, ఇప్పటికే తన ఆఫీస్లో రాముడిగా మహేష్ ఎలా ఉంటారో గ్రాఫిక్స్ కూడా సెట్ చేసి చూసుకున్నాం అంటూ ప్రశాంత్ వర్మ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Director @PrasanthVarma Wants to Cast Our SUPERSTAR @urstrulyMahesh as Lord Rama in Jai Hanuman ???pic.twitter.com/ZZG8ps9J3k
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) January 30, 2024
ఇప్పటికే రాముడి పాత్రలో మెగాహీరో రామ్ చరణ్, హనుమంతుడి పాత్రలో రానా నటించే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి. ఇక తాజాగా ప్రశాంత్ ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం చూస్తే రాముడిగా మహేష్, ఆంజనేయుడిగా చిరు అయితే సెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ..జై హనుమాన్ సినిమా తెరకెక్కించే కంటే ముందుగా ‘అధీర’, మరొకటి ‘మహాకాళి’ సినిమాలు చేయనున్నారు. ఈ సినిమా 2025 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.