Prasanth varma: హనుమాన్ దర్శకుడి వద్ద ఫుల్ టైమ్ జాబ్స్.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ట్రై చేయండి?

Prasanth varma: హనుమాన్ దర్శకుడి వద్ద ఫుల్ టైమ్ జాబ్స్.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ట్రై చేయండి?

హనుమాన్(HanuMan) సినిమాతో ఇండియా లెవల్లో భారీగా క్రేజ్ దక్కించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma). సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా వచ్చిన ఈ సినిమా కేవలం  రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు బడా బడా నిర్మాతలు. 

ఇదిలా ఉంటే.. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జాబ్ ప్రకటించాడు. తన టీమ్ పనిచేసినందుకు పోస్టర్ డిజైనర్ కావాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశాడు. పోస్టర్ డిజైనర్ గురించి చూస్తున్నాం. ఇది ఫుల్ టైం జాబ్. ఇంట్రెస్ట్ ఉంటే  talent@thepvcu.com ద్వారా మమ్మ‌ల్ని సంప్రదించండి.. అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దానికి నెటిజన్స్ నుండి కూడా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. మరి ఆ అవకాశాన్ని ఎవరు దక్కించుకొనున్నారో.       

ఇక ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన జై హనుమాన్ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా భారీ లెవల్లో తెరకెక్కనుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పోస్టర్స్ జై హనుమాన్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హనుమాన్ లెవల్లో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందా అనేది చూడాలి మరి.