ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్ (Double Ismart).టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dut) విలన్గా చేస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్కు ముందే భారీ బిజినెస్ చేస్తోంది. తొలుత ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్ సేల్ చేయాలని భావించారు నిర్మాతలు. కానీ పూరి గత చిత్రం లైగర్ కు సంబంధించి నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకు మధ్య ఇప్పటికి చర్చలు నడుస్తున్నాయి. దీంతో అవుట్ రేట్ సేల్ చేసేందుకు మొగ్గు చూపారు ప్రొడ్యూసర్స్ ఛార్మి అండ్ పూరీ.
తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని హోల్ అండ్ సోల్ గా హనుమాన్ ప్రొడ్యూసర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ చిత్ర రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హింది రైట్స్ ను కూడా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేసారు.
నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ ప్రాతిపాదికన ఏపీ/తెలంగాణ కలుపుకుని రూ.56 కోట్ల రూపాయలు, హిందీ రూ.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. అయితే, మొత్తం బిజినెస్ రూ.60 కోట్లకి పైగా అన్నమాట. ఇకపొతే ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాత ఛార్మి. ఓవర్సీస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నిర్వాణ సినిమాస్, తెలుగు రైట్స్ డిస్ట్రిబ్యూటర్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఏదేమైనా హీరో రామ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్ డీల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Delighted to collaborate with @Primeshowtweets for the Worldwide Distribution of our #DoubleIsmart in 5 Languages💥💥
— Puri Connects (@PuriConnects) July 22, 2024
Get ready for the MASS SHOW of USTAAD ISMART SHANKAR in Theaters from August 15th in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam ❤️🔥#DoubleIsmartOnAug15
Ustaad… pic.twitter.com/b1qgUcl5rP
వరుస ప్లాప్స్ తో ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో రామ్ లకు ఇంత పెద్ద మొత్తంలో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం హాట్ టాక్ అయిపొయింది. అయితే, ఇందుకు కారణం లేకపోలేదు మొదటి సినిమా 'ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన సక్సెస్ తో హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఇంత మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. మరి ఓపెనింగ్ డే కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా బాక్సాఫీస్ అంచనాలు ఈ మేరకు వెళ్లనున్నాయో తెలుస్తోంది.ఇప్పటికే, ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్,మాస్ బీట్ తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ లో క్రేజ్ ఫీలింగ్ తెప్పించాయి.
డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణిశర్మ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు ఫస్ట్ సాంగ్ తో ప్రూవ్ అయ్యింది. ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అత్యున్నత ప్రమాణాలతో రాబోతుంది.