ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు చాలు సినీ ఇండస్ట్రీలో జీవితాలు మారిపోవడానికి. నేమ్, ఫేమ్, లైఫ్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు అదే సిచువేషన్ లో ఉన్నారు యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja). ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan). సూపర్ హీరో కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కినన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక హనుమాన్ సినిమాలో హీరోగా చేసిన తేజ సజ్జ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ప్రతీ ఎలిమెంట్ లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దీంతో విమర్శకులు సైతం తేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక హనుమాన్ సూపర్ సక్సెస్ కావడంతో తేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ.. తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. తన తరువాతి సినిమా కోసం రూ.6 నుండి రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.
ఇక్కడ విశేషం ఏంటంటే.. హనుమాన్ సినిమాకు కోటి రూపాయల లోపే రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట తేజ. కేవలం ఒకే ఒక్క సక్సెస్ తో రూ.10 కోట్ల రేంజ్ డిమాండ్ చేస్తుండటంతో మేకర్స్ అవాక్కవుతున్నారట. నిజంగా తేజ సజ్జకి అంత మార్కెట్ ఉందా అంటే.. ఇప్పుడున్న సిచువేషన్ లో ఉందనే చెప్పాలి. హనుమాన్ గ్లోబల్ సక్సెస్ సాధించింది కాబట్టి.. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా మార్కెట్ లో తేజ సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. తేజ ఆ రేంజ్ లో డిమాండ్ చేయడం న్యాయమే అంటున్నారు నెటిజన్స్.