జై హనుమాన్ : నిండు పౌర్ణమిన.. ఈసారి బ్రహ్మ ముహూర్తంలో వస్తున్న హనుమాన్ జయంతి

జై హనుమాన్ : నిండు పౌర్ణమిన.. ఈసారి బ్రహ్మ ముహూర్తంలో వస్తున్న హనుమాన్ జయంతి

హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ప్రాముఖ్యత ఉంది.  శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో ఇప్పటికే ఉగాది.. శ్రీరామనవమి పండుగలు ముగిశాయి.  ప్రతి సంవత్సనం  చైత్రమాసం పౌర్ణమి రోజున   హనుమత్ జయంతి జరుపుకుంటాము.  ఈ ఏడాది  హనుమాన్​ జన్మదినోత్సవం ఏప్రిల్​ 12న  వచ్చింది.   హనుమాన్​ జయంతి ఘడియలు ఈ ఏడాది బ్రహ్మముహూర్తంలో వచ్చింది. హనుమాన్​ జయంతి ఘడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి... ఆరోజు ఎలా పూజచేయాలో తెలుసుకుందాం....

 హిందూ పురాణాల ప్రకారం, హనుమంతుడు చైత్ర మాసం..  పౌర్ణమి రోజున జన్మించాడు. ఈ ఏడాది (2025) ఏప్రిల్​ 12 శనివారం వచ్చింది.  హనుమంతుడు శివుని అవతారం..  అంజనాదేవి.. కేసరిల కుమారుడు.  త్రేతా యుగంలో, హనుమంతుడు అంజని తల్లి గర్భం నుండి జన్మించాడు.  హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు. 

హనుమాన్ జన్మోత్సవం శుభ సమయం

  • చైత్రమాసం పౌర్ణమి తిథి  ప్రారంభం : ఏప్రిల్ 12 తెల్లవారుజామున 3:21 గంటలకు
  • చైత్రమాసం పౌర్ణమి తిథి ముగింపు:   ఏప్రిల్ 13 ఉదయం 5:51 గంటలకు 
  • హిందూ పంచాంగం  ప్రకారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతిని జరుపుకోవాలి..

హనుమన్ జయంతి పూజా విధానం
 

  • హనుమంతుడి జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. ఈరోజున హనుమంతుడితో పాటుగా సీతా రాములను కూడా పూజించాలి.
  • ఆరోజు ( ఏప్రిల్​ 12)  బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి, ఎర్రటి వస్త్రాలను ధరించాలి.
  • హనుమంతుడికి సింధూరాన్ని, ఎర్రటి పూలను, తులసి దళాలను సమర్పిస్తే మంచిది.
  • హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకుల దండ.. వడ మాల  సమర్పిస్తే మంచిది.
  •  సింధూరంతో, తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి.
  •  హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
  •  హనుమంతుడికి హారతి ఇచ్చి, అందరికీ ప్రసాదాన్ని పంచాలి.
  • ప్రసాదంగా శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటివి చేయవచ్చు.

హనుమంతుడి ప్రాముఖ్యత

హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు. ఎనిమిది మంది అమరుల్లో ఒకరిని అంటారు. ఇప్పటికి కూడా ఆంజనేయస్వామి  భూమిపై ఉన్నారని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదాలు పొందవచ్చు. కష్టాల నుంచి బయట పడొచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. శాంతి, శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.