భద్రాచలం దేవస్థానంలో అంజన్నకు అభిషేకం

భద్రాచలం దేవస్థానంలో అంజన్నకు అభిషేకం

భద్రాచలం, వెలుగు : హనుమాన్​ జయంతి వేడుకలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో స్వామికి విశేషంగా అభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించి తమలపాకులు, నిమ్మకాయలు, అప్పాలమాలలు నివేదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన హనుమాన్​ దీక్షాపరులు స్వామికి ఇరుముడులు సమర్పించారు. అనంతరం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. 1.50లక్షల లడ్డూలు భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేశారు.