
- కనుల పండువగా శోభాయాత్రలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి సంబరాలు అంబరాన్నంటాయి. శనివారం ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమాన్ దీక్షాపరులు, భక్తులు స్వామివారికి పూజలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. నిజామాబాద్ నగరంలో హనుమాన్శోభాయాత్ర అశేషజనవాహిని మధ్య కనుల పండువగా సాగింది. జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్, జై హనుమాన్.. జైజై హనుమాన్ అన్న నినాదాలు మార్మోగాయి.
వేడుకల్లో ఎంపీ ధర్మపురి, పలువురు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఇరు జిల్లాల్లో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శోభాయాత్రలలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రెండు జిల్లాల్లోనూ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వెలుగు, నెట్వర్క్