
- కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి టౌన్, వెలుగు : హనుమాన్ జయంత్యుత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర జిల్లావాసులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ర్యాలీ రూర్లను పరిశీలించి, హిందూ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. నేటి ర్యాలీ పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్బీ సీఐ తిరుపతయ్య పాల్గొన్నారు.
సామాన్యులకు ఇబ్బంది కొలుగొద్దు..-నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
బోధన్, వెలుగు : హనుమాన్ ర్యాలీలో సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిజామాబాద్జిల్లావాసులకు సూచించారు. శుక్రవారం బోధన్ లోని అప్నాఫంక్షన్ హాల్లో హనుమాన్ జయంతి ర్యాలీ ఆర్గనైజర్లతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి నిర్వహించుకోవాలని, డ్రోన్ల వాడకాన్ని నిషేధించామన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ ర్యాలీ రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.
అనంతరం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి సైబర్ నేరగాళ్లపై నిఘా ఉండాలని, గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, పట్టణ, రూరల్, రుద్రూర్ సీఐలు వెంకట నారాయణ, విజయ్‌బాబు, కృష్ణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎస్సైలు మచ్చేందర్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.