సూర్యాపేట జిల్లాలో ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు

సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో ఐదు రోజులపాటు హనుమాన్ జయంతి వేడుకలు జరుగనున్నాయి.  మొదటి రోజు మంగళవారం కలశస్థాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి అఖండ దీపారాధన, విశ్వక్సేన పూజ, సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.

 ఈ వేడుకల్లో సుధాకర్ పీవీసీ అధినేతలు మీలా మహదేవ్, మీలా వాసుదేవ్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు, ఇన్​చార్జి కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరెడ్డి, అర్చకులు దరూరి శ్రీ రామానుజాచార్యులు, దరూరి శ్రీధరాచార్యులు, దరూరి శ్రీనాథాచార్యులు, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు వెంపటి సురేశ్, భక్తులు పాల్గొన్నారు.