హనుమాన్​ జయంతి ( ఏప్రిల్​ 12)న ఇలా చేయండి.. శనిదోషం నుంచి విముక్తి.. ఆర్థిక కష్టాలు తీరతాయి..

హనుమాన్​ జయంతి ( ఏప్రిల్​ 12)న ఇలా చేయండి.. శనిదోషం  నుంచి విముక్తి.. ఆర్థిక కష్టాలు తీరతాయి..

హిందూమతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి  ( ఏప్రిల్​ 12) జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున భజరంగబలిని పూజిస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైన రోజుగా ఉండనుంది. శనివారం హనుమంతుడికి .. శని దేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజునే ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది. దీంతో హనుమాన్ జయంతి ప్రత్యేకత రెట్టింపు అయ్యింది.ఈ రోజున హనుమంతుని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు తీసుకుంటే మంచిది. హనుమాన్ జయంతి రోజు ఈ సింపుల్ రెమెడీస్ పాటించారంటే మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల భూత, ప్రేత పిశాచాల భయాలు తొలగిపోతాయి.

శని దోషం పోగొట్టేందుకు : హనుమాన్​ జయంతి రోజున  ఒక పీటపై .. ఎర్రని గుడ్డను ఉంచి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఉంచాలి.  ఆ పటం ఎదురుగా   ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. . హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పురాణాల ప్రకారం శని పట్టని వారిలో హనుమంతుడు ఒకరు. అందుకే ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా పొందినట్టే. శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది.

ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలిగేందుకు : ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు  హనుమాన్ జయంతి రోజున పంచదారను దానంచేయాలి.  లేదంటే పంచదారతో తయారు చేసిన స్వీట్స్​ కూడా మీ ఇంటి చుట్టు పక్కల వారికి పంచిపెట్టవచ్చు.  ఈ రోజున పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి.

 రుణ బాధల నుంచి బయట పడేందుకు : హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి, ఎర్ర చోళం సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయట పడతారు. ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. 

హనుమాన్ జయంతి రోజున   ఉపవాస దీక్షను పాటించాలి. ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి. జీవితంలోని అన్ని బాధలు, సంక్షోభాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.  ఆ రోజున ( ఏప్రిల్​ 12) ఆంజనేయస్వామి ఆలయానికి వళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించి .. ఓం ఆంజనేయాయ విద్మహే .. మహాబలాయ ధీమహి తన్మో హనుమత్​ ప్రచోదయాత్​ అని108 సార్లు పఠించాలి. దీనివలన ఆనందమైన జీవితం లభిస్తుందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

కోతులకు ఆహారం :  హనుమంతుడిని కోతుల అవతారంగా భావిస్తారు.  e రోజున, కోతులకు బెల్లం, పప్పు, అరటిపండు లేదా ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది.

రామ నామాన్ని జపించండి.హనుమంతుడు రాముని ప్రత్యేక భక్తుడిగా పరిగణించబడతాడు. ఈ రోజున “శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్” అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుంది.

తమలపాకుల దండ : ఆంజనేయస్వామికి తమలపాకులు.. సింధూరం అంటే ఎంతో ప్రీతి.  హనుమత్​ జయంతి రోజున ( ఏప్రిల్​ 12) 108 తమలపాకులపై జైశ్రీరామ్​ అని రాసి వాటిని దండ కట్టి.. స్వామి వారి మెడలో ఆదండను హనుమాన్​ చాలీసా పఠిస్తూ వేస్తే హనుమంతుడి అనుగ్రహం కలిగి.. కోరుకున్నవన్నీ జరుగుతాయి.

సుందరకాండ పారాయణం: హనుమంతుడికి సంబంధించిన సుందరకాండను హనుమాన్ జయంతి రోజు ( ఏప్రిల్​ 12)  పారాయణం చేయాలని చెబుతున్నారు.  సుందరాకాండ పారాయణం వలన జీవితంలో ఎలాంటి కష్టాలైన తొలగుతాయి. సుందరాకాండ పారాయణం  చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.