హనుమాన్​ జయంతి : ఈ సాయంత్రం 6:45 నుంచి 8:08 వరకు అద్భుత సమయం.. ఈ మంత్రాన్ని జపిస్తే సర్వరోగాలు పోతాయంట..!

హనుమాన్​ జయంతి : ఈ సాయంత్రం 6:45 నుంచి 8:08 వరకు అద్భుత సమయం.. ఈ మంత్రాన్ని జపిస్తే సర్వరోగాలు పోతాయంట..!

హనుమాన్ జయంతి.. హనుమంతుడు బలశాలి.. ధైర్యవంతుడు.. హనుమంతుడిని పూజిస్తే ఎక్కడ లేని శక్తులు వస్తాయి.. హనుమంతుడి ఆరాధనతో భూత, ప్రేత, పిశాచాలు కూడా పిల్లల జోలికి రావనే విశ్వాసం.. హనుమంతుడిని భక్తితో.. శ్రద్ధగా పూజిస్తే సర్వరోగాలు పోతాయనే ప్రతీతి.. అలాంటి హనుమంతుడి పుట్టిన రోజు అనేది ఎంతో విశిష్ఠమైనది.. 2025, ఏప్రిల్ 12వ తేదీ హనుమాన్ జయంతి.. అంటే శనివారం.. ఈరోజునే. 

ఈ దివ్యమైన పవిత్రమైన రోజున.. మీరు హనుమంతుడి సేవలో.. శ్రద్ధగా పూజిస్తే సర్వరోగాలు పోతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. హనుమాన్ జయంతి రోజు.. 24 గంటల్లో రెండు దివ్యమైన.. అద్భుత గడియలు ఉన్నాయి.

ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 8 నిమిషాల వరకు.. అంటే 83 నిమిషాల సమయం అనేది చాలా చాలా అద్భుతంగా.. దివ్యంగా.. బలమైన సమయంగా చెబుతున్నారు పండితులు. 12వ తేదీ సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 8 నిమిషాల మధ్యలో హనుమంతుడి సేవలో ఉండాలని చెబుతున్నారు పండితులు. 

ఈ సమయంలో పఠించాల్సిన మంత్రాన్ని ఏంటో తెలుసా.. 


ఓం హన్ హనుమతే రుద్రతకాయ హుమ్ ఫట్
ఓం నమో భగవతే హనుమతే నమః
ఓం మహాబలయ్ వీరయ్ చిరంజీవీన్ ఉద్దతే.. 
హరిణే వజ్ర దేహే చోలంఘిత్ మహావయ్యే. 
నమో హనుమతే ఆవేశాయ ఆవేశాయ స్వాహా ।
ఓం నమో హనుమతే రుద్రావతారాయ, రామదూతాయ స్వాహా..!


ఈ మంత్రాన్ని ఈ 83 నిమిషాల సమయంలో నిష్ఠగా జపిస్తే.. సర్వరోగాలు పోతాయని.. శతృనాశనం జరిగి.. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పురాణాల ఆధారంగా చెబుతున్నారు పండితులు. ఆంజనేయుడి భక్తులు అందరూ.. ఈ సాయంత్రం.. ఈ సమయంలో.. ఈ మంత్రాన్ని పఠించటం ద్వారా మీకు, మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశిస్తున్నాం..