92ఏళ్ళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. టాప్ ప్లేస్ హనుమాన్దే

92ఏళ్ళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. టాప్ ప్లేస్ హనుమాన్దే

హనుమాన్(Hanuman).. హనుమాన్.. హనుమాన్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. థియేటర్స్, టీవీ, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా అదే టాపిక్. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. విడుదలై 20 రోజులు కావస్తున్నా ఈ సినిమా సృష్టిస్తున్న సంచనాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాదరణతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. బాక్సాఫిస్ దగ్గర ఇప్పటికే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా.. తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. 

ఇటీవల హనుమాన్ సినిమా రూ.250 కోట్లు కలెక్షన్స్ దాటేసిన ఈ సినిమా.. తాజాగా రూ.278 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విదంగా 92 ఏళ్ళ సినీ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది ఈ మూవీ. ఎలా అంటే.. సంక్రాంతి వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా హనుమాన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ 260 కోట్లతో ఆలా వైకుంఠపురంలో సినిమా పేరుమీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి లిస్టులో టాప్ పొజిషన్ లో నిలిచింది హనుమాన్ మూవీ. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. 92ఏళ్ళ సినీ చరిత్రలో ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు హనుమాన్ టీం.

also read :-  తమన్నాతో పెళ్లి ఎప్పుడు?..విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దీంతో హనుమాన్ మూవీ లవర్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. అంతేకాదు.. ఒక చిన్న సినిమాగా విడుదలై, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఈ రేంజ్ సక్సెస్ అవడం అంటే మాములు విషయం కాదు అంటూ.. హనుమాన్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఓవర్ సీస్ లో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ సెట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • Beta
Beta feature