సంక్రాంతి సీజన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సినిమాలు. ఈ సీజన్ లో వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుంటాయి. వరుస సెలవులు ఉంటాయి కాబట్టి ఈ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా తమ సినిమాలను సంక్రాంతి సీజన్ దించి భారీ కలెక్షన్స్ రాబట్టాలని ప్లాన్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వరుసగా భారీ సినిమాలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమయ్యాయి.
అందులో అందులో మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగా సినిమాలు ఉన్నాయి. అయితే ముందు నుండి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఏంటంటే.. ఈ పండగకి ఉన్న ఒకే ఒక పెద్ద సినిమా మహేష్ బాబు గుంటూరు కారం అని, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటారని, కాబట్టి ఈ సీజన్ విన్నర్ కూడా గుంటూరు కారమే అని ఫిక్స్ అయిపోయారు. గుంటూరు కారం నిర్మాత నాగవంశీ కూడా ఇదే విషయాన్నీ పదే.. పదే చెప్పుకొచ్చాడు.
అయితే, బయట ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం వేరేలా ఉందని అర్థమవుతోంది. అదేంటంటే.. ప్రేక్షకులు ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమాను చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కుర్ర హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాపై ముందునుండి భారీ అంచానాలు ఉన్నాయి. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో హనుమాన్ లాంటి డివైన్ కంటెంట్ కూడా ఉండటంతో సహజంగానే హనుమాన్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.
బుక్ మై షోలో ప్రస్తుతం ఉన్న లెక్కలు కూడా ఇదే చెప్తున్నాయి. హనుమాన్, గుంటూరు కారం మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బుక్ మై షోలో హనుమాన్ సినిమాపై 179.8k ఇంట్రెస్ట్ చూపిస్తుంటే గుంటూరు కారం సినిమాపై 179.5k చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉన్నా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాకు హనుమాన్ సినిమా గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతానికి హనుమాన్ సినిమానే టాప్ లో కూడా ఉంది. దీంతో.. ఇది చూసిన ఆడియన్స్ సినిమాలో ఉండాల్సింది కటౌట్ కాదు కంటెంట్, అది జనవరి 12న తెలుస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఒకే రోజు వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది విజయాన్ని అందుకుంటుందో చూడాలి.