టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన హీరోగా వచ్చిన గత సినిమాలేవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. చివరగా ఆయన హీరోగా వచ్చిన మూవీ రూల్స్ రంజన్(Rules Ranjan). తమిళ దర్శకుడు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిజానికి ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు కిరణ్ కానీ, రిజల్ట్ మాత్రం మారలేదు. ఈ సినిమా విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా మరో సినిమాను ప్రకటించలేదు కిరణ్.
అయితే తాజాగా కిరణ్ అబ్బవరం సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమాన్ మేకర్స్ అప్పటిలో కిరణ్ అబ్బవరంతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను భారీ తెరకెక్కించనున్నారు అనే టాక్ నడిచింది. కానీ, ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ALSO READ :- Lambasingi OTT: ఓటీటీకి వచ్చేసిన గ్లామర్ దివి లంబసింగి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక హనుమాన్ మేకర్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వారి చేతుల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్, అధీర సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు మెగా హీరో సాయిధరమ్ తేజ్, నితిన్ లతో కూడా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పట్లో కిరణ్ అబ్బవరం సినిమా ఉండకపోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.