HanuMan OTT: హనుమాన్ OTTకి రాలేదు.. కారణం ఏంటంటే?

HanuMan OTT: హనుమాన్ OTTకి రాలేదు.. కారణం ఏంటంటే?

హనుమాన్(HanuMan).. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో రన్ అవుతోంది ఈ సినిమా. ఇటీవలే 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది హనుమాన్ మూవీ. ఈ సందర్బంగా ఇటీవలే హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. 

మార్చ్ 8న శివరాత్రి సందర్బంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు స్ట్రీమింగ్ పాట్నర్ జీ5 తెలిపింది. దీంతో ఆడియన్స్ మార్చ్ 8 కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. అయినప్పటికీ.. వారికి నిరాశే మిగిలింది. కారణం ముందు చెప్పినట్టుగా మార్చ్ 8న సినిమా ఓటీటీలో రిలీజ్ అవలేదు. అయితే హనుమాన్ సినిమా సిఓటీటీ స్ట్రీమింగ్ కాకపోవడంపై ఓటీటీ సంస్థ జీ5 స్పందించింది. ప్రేక్షకులు క్షమించాలి. కొన్ని టెక్నీకల్ కారణాల వాళ్ళ ఇవాళ హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవలేదు. మరికొన్ని గంటల్లో మీకు హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ ఇస్తాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో.. శివరాత్రి సందర్బంగా హనుమాన్ సినిమా చూద్దాం అనుకున్న ఆడియన్స్ కు నిరాశే ఎదురయింది. 

ALSO READ :- శివరాత్రి ఉరేగింపులో విషాదం 14మంది పిల్లలకు కరెంట్ షాక్

ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు, యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. సూపర్ హీరో కాన్సెప్ట్ అండ్ ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే.