హనుమాన్ (HanuMan) సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది మొదట గ్రాఫిక్స్ అయితే, రెండవది మ్యూజిక్ అనే చెప్పాలి. గౌరహరి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిలో మరీ ముఖ్యంగా రఘునందన రఘు రఘు నందన అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
లేటెస్ట్గా రఘునందన రఘు రఘు నందన అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రఘు రఘు నందన, రఘువర సేవన..రఘు పతి ఛాయాన..శత యోజన..శత శత యోజన..శరది నియోజన..శరపరి లంఘన లిరిక్స్ ఆడియాన్స్ కు రోమాలు నిక్కపొడుచుకునేలా ఉన్నాయి.హనుమాన్ సెకండ్ హాఫ్లో హనుమంతుని శక్తుల గురించి విభీషణుడు వివరిస్తున్న సీన్లో వచ్చే ఈ పాత ఆడియన్స్కు గూస్బంప్స్ తెప్పించింది. విభీషణుడు చెప్పే ఒక్కో డైలాగ్కు వచ్చే ఒక్కో సీన్..ఆ సీన్కు బీజీఎమ్గా వచ్చే రఘునందన సాంగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.
నిజానికి ఈ సాంగ్ కోసం ఆడియన్స్ సినిమా రిలీజ్ నుండి ఎదురుచూస్తున్నారు. హనుమాన్ ఆడియో జ్యూక్ బాక్స్లో కూడా ఈ పాట లేకపోవడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆడియన్స్ ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ.. రఘునందన సాంగ్ రిలీజ్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ మూవీ సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్ఛర్య పరిచింది.