యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adipurush). ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్,సాంగ్స్ ఉండటంతో సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న ప్రతీ థియేటర్ లో, ప్రతీ షో కి ఒక సీట్ ను హునుమాన్ కోసం వదిలేయాలని యూనిట్ సూచించిన సంగతి తెలిసిందే. దీనికి ఆడియన్స్ నుండి కూడా భారీ స్పందన వచ్చింది. ఇక తాజాగా హానుమాన్ కోసం ఏర్పాటు చేసిన ఒక సీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ఫొటోలో సినిమాలో హల్ ఒక సీట్ పై హనుమంతుని రూపం ఉన్న శాలువా కప్పి ఉంది. ఇది ఆదిపురుష్ సినిమా ప్రదర్శనలో భాగంగా హనుమాన్ కోసం వదిలేసినా సీట్ అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఫోటో కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. అంతేకాదు హనుమంతుని పక్క సీటు కోసం కూడా చాలా డిమాండ్ ఏర్పడింది. ఇందుకోసం వేళల్లో ఖర్చు చేస్తున్నారు ఆడియన్స్.