తొర్రూరు, వెలుగు: కరాటేలో రాణిస్తే ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు మంచి భవిష్యత్ ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. శ్రీధర్ కరాటే అకాడమీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఝాన్సీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
పోటీల్లో వివిధ జిల్లాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రతిభ చూపిన వారికి ట్రోఫీ, మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా నెల్లికుదురు మండలం రామన్నగూడెం చెందిన ఆకుతోట కార్తికేయ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగు సురేందర్, జిల్లా సీనియర్ నాయకులు కేతినేని నిరంజన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు సోమా రాజశేఖర్, నరేందర్ రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్ సోమ శ్రీధర్, నవీన్ కుమార్, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ..
రాయపర్తి: మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తండ్రి కేవ్లానాయక్ ఇటీవల మృతి చెందాడు. ఆదివారం పలువురు ప్రముఖులు వరంగల్ జిల్లా రాయపర్తి మండల ఊకల్లు శివారు బాలాజీతండాలో ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ తదితరులు ఆయనను పరామర్శించారు. అనంతరం ఝాన్సీరెడ్డి మండలంలోని కొండాపురం, బంధనపల్లి, రాయపర్తి గ్రామాల్లో పలువురు మృతులు, బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.