యాదాద్రి, వెలుగు : జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు లిస్టు తయారు చేయాలని యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే ఆదేశించారు. కలెక్టరేట్లో ఓటరు ధ్రువీకరణ, ఓటరు జాబితా తయారీపై అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ చేయాలని చెప్పారు. జనవరి 6, 2024న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల చేసి, జనవరి 22 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు.
ఫిబ్రవరి 2 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, ఫిబ్రవరి 8 నాటికి ఫైనల్ చేయాలన్నారు. ఏజ్ వైజ్‌గా లిస్ట్‌ను రెడీ చేయాలని ఆదేశించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఈ ఓటర్ లిస్ట్ అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో అమరేందర్, సూపరింటెండెంట్ నాగేశ్వర చారి, తహసీల్దార్లు ఉన్నారు.