ఆంజనేయుడికి ఇష్టమైన ఆహారం ఇదే.. వీటిని ప్రసాదంగా పెట్టండి.. మీరూ తినండి.. బలం, ధైర్యం వస్తాయి..!

ఆంజనేయుడికి ఇష్టమైన ఆహారం ఇదే.. వీటిని ప్రసాదంగా పెట్టండి.. మీరూ తినండి.. బలం, ధైర్యం వస్తాయి..!

హిందూ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం హనుమాన్ జయంతి లేదా హనమాన్​ విజయోత్సవ్​ను  చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటున్నాం. ఈ ఏడాది ( 2025) హనుమాన్​ జయంతి ఏప్రిలఖ 12 శనివారం వచ్చింది. శనివారం  హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి, ఆ రోజే హనుమాన్ జయంతి రావడం విశేషంగా చెప్పబడింది.ఆ రోజున ఉపవాసం ఉండి.. స్వామివారిని పూజించి కొన్ని ప్రత్యేక మైన పదార్ధాలు నైవేద్యంగా సమర్పించి.. వాటిని ప్రసాదంగా  స్వీకరిస్తే.. బలం.. ధైర్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .

హనుమాన్​ జయంతి రోజున హిందువులు.. భజరంగ్ దళ్​ ను పూజిస్తారు.  ఈరోజున ఆంజనేయ స్వామి వారిని పూజించి.. ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు.  ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

ALSO READ : హనుమాన్​ జయంతి ( ఏప్రిల్​ 12)న ఇలా చేయండి.. శనిదోషం నుంచి విముక్తి.. ఆర్థిక కష్టాలు తీరతాయి..

బెల్లం .. పప్పు: ఆంజనేయస్వామికి.. బెల్లం.. వేయించిన పప్పులు అంటే చాలా ఇష్టమట.  అందుకే బెల్లంతో తయారు చేసిన శనగపప్పు ఉండలను స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యంతో పాటు బలం.. ధైర్యం వస్తాయని పండితులు చెబుతున్నారు. సీతమ్మతల్లి అన్వేషణకు బయలు దేరే సమయంలో స్వామి ఆహారంగా బెల్లాన్ని.. తీసుకెళ్లాడని.. దారి మధ్యలో శనగచేల్లోకి వెళ్లి యలను పొట్టు వలచుకొని బెల్లంతో కలిపి తిన్నాడట.  సహజంగా శక్తిమంతుడైన ఆంజనేయునికి ఈ ఆహారం ఎంతో బలాన్ని చేకూర్చిందని చెబుతున్నారు.

శనగపిండితో బూందీ లడ్డు:  ఆంజనేయస్వామికి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం.  సహజంగా బూందీని శనగపిండితో తయారుచేస్తారు.  హనుమాన్​జయంతి రోజున స్వామి వారికి బూందీ లడ్డు సమర్పిస్తే.. ఆనందం.. విజయం లభిస్తుంది.  అందుకే ఏదైనా విజయం సాధించినప్పుడు లడ్డూలు పంచిపెడతారు.  

కుంకుమపువ్వుతో ..పాలు .. స్వీట్లు :  కుంకుమపువ్వు ఎర్రగా ఉంటుంది.  పాలు తెల్లగా ఉంటాయి.. స్వీట్లు తియ్యగా ఉంటాయి.  ఈ మూడు రకాల మిశ్రమం స్వచ్చత.. సాత్వికతను సూచిస్తాయి.   ఇవి మనశ్శాంతిని కలుగజేయడమే కాకుండా.. మానసిక శక్తిని పెంచుతాయి.  అందుకే గర్భిణీ స్త్రీలు కుంకుమపువ్వు కలిపిన పాలను తాగుతారు.  ఇలా తాగితే ఎర్రటి సంతానం కలుగుతారని చెబుతారు.  ఇది ఆధ్యాత్మికమైతే.. సైంటిఫిక్​ కుగా కుంకుమపువ్వుకు ఆవేశాన్ని తగ్గించి.. మానసికప్రశాంత చేకూర్చే లక్షణం ఉందని ఆయుర్వేద నిపుణలు చెబుతున్నారు.  అందుకే హనుమాన్​ జయంతి ఈ మిశ్రమాన్ని నైవైద్యంగా పెట్టి.. ప్రసాదంగా స్వీకరిస్తే.. ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

సింధూరం.. జాస్మిన్​ నూనె :  ఆంజనేయస్వామికి ఆరంజ్​ కలర్​ అంటే చాలా ఇష్టం.. హనుమత్​ జయంతి రోజున స్వామిని సింధూరం.. జాస్మిన్​నూనె (మల్లె నూనె)తో అలంకారం స్వామి సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.  మల్లెవాసన ఎంత సుగంధ భరితంగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే కదా.  జాస్మిన్​ ఆయిల్​ తో కలిసిన సింధూరాన్ని నుదుట ధరిస్తే శరీరంలోకి క్రిములు నశిస్తాయి. 

అరటి పండ్లు.. కొబ్బరి.. ​:  హనుమంతుడికి  తాజా పండ్లు నైవేద్యం పెట్టడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా అరటిపండు  కొబ్బరికాయను సమర్పించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిని ఆరోగ్యం మరియు దీర్ఘాయువుకు చిహ్నంగా భావిస్తారు.