ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సర్వీసెస్‌లో ఒకటైన Gmail ది ఈరోజు పుట్టిన రోజు. అవును స్వయంగా గూగుల్ ఇండియా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ ఫన్నీ మూమెంట్ ను గుర్తుచేస్తూ పోస్ట్ చేసింది. సరిగ్గా 20 సంవ్సతరాల క్రితం ఇదే రోజు అంటే ఏప్రిల్ 1న గూగుల్ కంపెనీ కో పౌండర్స్ లారీ పేజ్, సెర్గీ బ్రిన్ Gmail సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలా మంది అది ఏప్రిల్ ఫూల్ జోక్ భావించారు. దాన్ని గుర్తు చేస్తూ గూగుల్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో సర్‌ప్రెస్ అంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు జీ మెయిల్ అని ఫోస్ట్ చేసింది. 20 సంవత్సరాల అనుభందాన్ని జరుపుకుంటున్నాము. మీ గిఫ్ట్ అంటూ ఎక్స్‌లో తెలిపింది. అలాగే ఆరోజు ఏప్రిల్ ఫూల్ అనుకున్నారని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గూగుల్ బిజినెస్ లో జీమెయిల్ పెద్ద షేర్ ను కలిగి ఉంది. దానికి గూగుల్ చాట్, గూగుల్ మీట్ అనే ఫీచర్స్ కూడా యాడ్ చేసింది.
PFA - Our thanks and regards ♥️ pic.twitter.com/XmWH7JMTSh
— Google India (@GoogleIndia) April 1, 2024
also read : Gold Price: గోల్డ్ లవర్స్‌కి షాక్..ఆల్ టైం గరిష్టానికి బంగారం ధర
కానీ ఈరోజు కొన్ని మిలియన్ల Gmail ఖాతాలు ఉన్నాయి. మన ఫోన్ లో ఏ అకౌంట్ లాగిన్ చేయాలన్నా Gmail తప్పని సరి. ప్రారంభంలో ఒక జీ మెయిల్ అకౌంట్‌కు 1జీబీ వరకు స్టోరేజ్ ఫ్రీగా ఇచ్చేది. కానీ ప్రస్తుతం 15 జీబీ వరకు గూగుల్ ఫ్రీగా అందిస్తోంది. తర్వాత గూగుల్ మ్యాప్స్, గూగుల్ క్రోమ్, గూగుల్ డాక్స్ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తర్వాత యూటూబ్‌ను కూడా కొన్నది.
ఈ మెయిల్ లను 13,500 స్టోర్ చేసుకోగలదు. జీమెయిల్ కు పోటీగా యాహూ, మైక్రోసాఫ్ట్ లాంటివి ఉన్నా.. జీమెయిల్ చాలా ఆదరణ పొందింది. హ్యాపీ బర్త్ డే Gmail..