నాన్నపై ఉన్న ప్రేమను, మమకారాన్ని అంకితభావాన్ని గౌరవించే ఒక ప్రత్యేక సందర్భం ఫాదర్స్ డే ( జూన్ 16) . పిల్లలను పెంచడంలో, వారి అభివృద్ధిలో తల్లి, తండ్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కడుపులో నవమోసాలు మోసిన తల్లికి ఎంత విలువ ఉంటుందో.. ఆ బిడ్డ బాధ్యతలను మోసే తండ్రికి కూడా అంతే విలువ ఉంటుంది.. కుటుంబానికి నాన్నే మూలస్తంభం. అందుకే తండ్రి పాత్ర చాలా కఠినమైంది. అంతకంటే గొప్పది. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 16న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని మీ నాన్నకు ప్రేమతో ఫాదర్స్ డే విషేస్ తెలియజేయండి
- నాన్న.. మీరే నా మొట్టమొదటి గురువు. మీరే నా బెస్ట్ ఫ్రెండ్..హ్యాపీ ఫాదర్స్ డే
- నాన్న మీరు నా ధైర్యం, నా గర్వం, నా గౌరవం..మీరే నా బలం, నా మూలధనం.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
- నాన్న నా ఆశ. నాన్న నా శ్వాస. నాన్నా అందుకో .....పితృ దినోత్సవ శుభాకాంక్షలు
- మన జీవితాన్ని గెలిపించేందుకు, తను అలుపెరగకుండా నిరంతరం శ్రమించే నిస్వార్థ జీవి నాన్న ...హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
- ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా.. ఓడినప్పుడు నేనున్నానులే ..అని నీ వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి నాన్న. .....హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
- గెలిచినప్పుడు ఆనందంగా.. పదిమందికి చెప్పుకునే వ్యక్తి నాన్న ఒక్కరే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
- నాన్నని ప్రేమించండి.. నాన్నను గౌరవించండి. ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేవాడే నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
- దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న. నాన్న మీరేప్పుడూ సంతోషంగా ఉండాలి. ....హ్యాపీ ఫాదర్స్ డే
- నా తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నాకు ఎప్పుడూ దొరకలేదు....అన్ని సమయాల్లో నాన్నలో నాపై ప్రేమను చూశాను.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
- ఉరుములా బయటకు గంభీరంగా ఉన్నా.. ఆ వెనక చల్లని వర్షమై కురిపించే ప్రేమనే తండ్రి... - ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న
- తండ్రి లేని జీవితం నిర్జనమైంది...తండ్రి లేని ఒంటరి ప్రయాణం.. ఎడారిగా ఉంటుంది.. నాన్నే నా భూమి.. నాన్నే నా ఆకాశం.. ఆ దేవుడే మా నాన్న..ప్రియమైన నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే.
- తప్పటడుగులు వేయకుండా..ఎప్పటికీ తడబడకుండా..మనం ఎప్పటికీ తూలిపడకుండా..వెంటే ఉండేవాడు నాన్న. ...హ్యాపీ ఫాదర్స్ డే.
- నాన్న.. ఓర్పుకు, సహనానికి మారుపేరు... తండ్రులందరికీ పితృదినోత్సవం శుభాకాంక్షలు
- అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలు తెలియజేస్తుంది. కానీ నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు. ...హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
- 'బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది.. నలుగురితో ఎలా మెలగాలో నేర్పేది.. కేవలం ఒక్క నాన్న మాత్రమే... - హ్యాపీ ఫాదర్స్ డే
- నాన్నంటే బంధం మాత్రమే కాదు.. నాన్నంటే బలం. నాన్నంటే భయం కాదు.. నాన్నంటే బాధ్యత. నాన్నంటే సంతోషమే కాదు.. నాన్నంటే సర్వస్వం. హ్యాపీ ఫాదర్స్ డే.
- అమ్మ ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపానిచ్చి, వ్యక్తిగతంగా చేసే వ్యక్తి ప్రతి విజయంలో వెనక ఉంటూ బాధలోనైనా నేనున్నానని ఆసరా ఇచ్చే వ్యక్తి నాన్న. .. - హ్యాపీ ఫాదర్స్ డే
- అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం.. కానీ, నాన్న ప్రేమను మాత్రం కన్నీళ్లతోనే తెలుసుకోగలం'- నా ప్రియమైన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
- నాన్న..అనే పదము కంటే కమ్మగా ఉండదు ఆ వెన్న. లక్షం వైపు దూసుకెళ్లే బాణం మనమైనా..నాన్నలాంటి విల్లే లేకపోతే దాని ఫలితం సున్నా. నాన్న పెంపకములో కఠినత్వం ఉన్నా.. ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన. రేపటి మనకు నిలువుటద్దం నాన్న.. అలాంటి నాన్న దేవుడి కన్నా మిన్న. ..హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
- భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న.. మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి... - హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
- నీ సంతోషాన్ని త్యజిస్తూ, నిత్యం శ్రమిస్తూ మా కోసం ఎంతో చేస్తున్న నువ్వే.. నా రియల్ హీరో నాన్న.... - హ్యాపీ ఫాదర్స్ డే
- స్క్రీన్ మీద ఎందరు హీరోలను చూసి చప్పట్లు కొట్టినా.. మా నిజజీవితంలో రియల్ హీరో మాత్రం నువ్వే నాన్న.... - ఐ లవ్యూ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే
- సముద్రానికి ఎదురీదుతూ మిమ్మల్ని జీవితంలో విజయ తీరాలకు చేర్చే అసలైన నావికుడు నాన్న.... ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న
- నా తండ్రి ప్రేమ కంటే.. గొప్ప ప్రేమ ఎప్పుడు కూడా నాకు దొరకలేదు. అన్ని వేళల్లో నాన్నలో నాపై ప్రేమను చూశాను - లవ్యూ నాన్న... హ్యాపీ ఫాదర్స్ డే
- నాన్న చూపిన బాటలో గెలుపు ఉంటుందో లేదో తెలియదు. కానీ, ఓటమి మాత్రం ఉండదు...హ్యాపీ ఫాదర్స్ డే