పెద్దలతో పాటు పిల్లలూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వినాయక చవితి మరో రెండు రోజుల్లోనే రానుంది. ఈ ఉత్సవం సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12:39 నుంచి సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:43 గంటల వరకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలను ఈ విధంగా తెలియజేయండి.
ALSO READ: తొలిపూజకు ఖైరతాబాద్ గణేశుడు రెడీ.. ఈ సారి 63 అడుగుల ఎత్తులో దర్శనం
- విశ్వనాయకుడు గణేష్ మహారాజుకు జై.. మీ కష్టాలు, అడ్డంకులు అన్నింటినీ ఈ ఏడాది మన వినాయడు తొలగించాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి
- ‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
- ‘గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు…’
- ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ… గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా, మీ కష్టాలను సంతోషంగా, కారుమబ్బులను హరివిల్లులగా మార్చాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి.
- గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తియ్యగా ఉంటుందో, అంతే తియ్యగా మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
- బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన లడ్డూలు, కుడుములతో పాటు మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు..
- విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి..
- మీ ప్రతి పనిలో విజయం సాధించాలి, జీవితంలో దుఃఖం ఉండకూడదు. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
- ఓం గన్ గణపతాయ నమో నమః! శ్రీ సిద్ధివినాయక నమో నమః! అష్ట వినాయక నమో నమః! గణపతి బప్పా మోరియా!