- నాలుగు రోజుల పాటు ఉత్సవాలు
- తరలివచ్చిన 3 లక్షల మంది భక్తులు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో వైభవంగా నిర్వహించిన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. 3 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో మాల విరమణకు సుమారుగా నాలుగు గంటల సమయం పట్టింది. భక్తుల సంఖ్యకు
అనుగుణంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఫ్రీ బస్ సర్వీసులు నడిపారు. ఆలయానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో చంద్రశేఖర్, సీఐ నీలం రవి, ఉత్సవాల ఇన్‌చార్జి వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.