ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో ఉన్న హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ హై స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ యలమంచిలి రవీంద్రనాధ్, కవి, ఫెమా ప్రెసిడెంట్ మువ్వా శ్రీనివాసరావు, హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్, స్కూల్ ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి అటెండయ్యారు.
పొంగులేటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూరల్ ప్రాంతాభివృద్ధికి, కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా స్ప్రింగ్ లీఫ్ హై స్కూల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పి.రవి మారుత్ మాట్లాడుతూ ఒత్తిడి లేని విద్యను అందిస్తూ, బాల్యానికి భరోసా కల్పించడమే హార్వెస్ట్ విద్యాసంస్థల అభిమతమని తెలిపారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ రాజన్, ప్రీతీ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.