హ్యాపీ జన్మాష్టమి.. మీ ప్రియమైన వారిని విష్ చేయండిలా..

హ్యాపీ జన్మాష్టమి.. మీ ప్రియమైన వారిని విష్ చేయండిలా..

జన్మాష్టమి, కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి, కృష్ణాష్టమి అని పలు పేర్లతో పిలుచుకునే ఈ పర్వదిన ఈ సంవత్సరం వరుసగా రెండు రోజులు వస్తుంది. శ్రీకృష్ణుని భక్తులు సెప్టెంబర్ 6, 7 తేదీలలో ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ ఉత్సవం శ్రీకృష్ణుని జన్మదినాన్ని తెలియజేస్తుంది. ఇది భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు వస్తుంది. ఈ రోజున, ప్రజలు దేవాలయాలను సందర్శిస్తారు, ఉపవాసాలను ఆచరిస్తారు, సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. శ్రీకృష్ణుని విగ్రహాలను కొత్త బట్టలు, ఆభరణాలతో అలంకరిస్తారు. వారి ఇళ్లను, పూజా స్థలాలను అందంగా చేస్తారు. దాంతో పాటు రుచికరమైన స్నాక్స్ తయారు చేస్తారు.

మీరు కూడా మీ ప్రియమైనవారితో కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటున్నట్లయితే, లేదా వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నట్టయితే.. ఈ కింది ఫొటోలు, మెసేజ్ లు, కోట్ లు, శుభాకాంక్షలను ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయండి.

ALSO READ :కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే.. మీరూ మీ పిల్లలకు పెడుతున్నారా..

  • శ్రీకృష్ణుడు ఈ రోజే గాక ఎల్లప్పుడూ మీకు తమ దీవెనలను ప్రసాదించుగాక. మీకు, మీ కుటుంబ సభ్యులకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
  • శ్రీకృష్ణుడు మీకు, మీ ప్రియమైన వారి జీవితాలను ప్రేమ, ఆనందం, ప్రశాంతత, శ్రేయస్సుతో నింపాలని ఆశిస్తున్నాను. ఈ రోజున సంతోషకరమైన జన్మాష్టమి జరుపుకోండి.
  • కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సరైన మార్గాన్ని చూపాడు. జన్మాష్టమి శుభాకాంక్షలు.
  • "మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైతే, వ్యూహాన్ని మార్చుకోండి, లక్ష్యం కాదు." - శ్రీకృష్ణుడు, భగవద్గీత.
  • ఈ రోజు ప్రత్యేకమైన వ్యక్తి జన్మించినందున ఇది చాలా విలువైన రోజు. ఆయన చెడుతో పోరాడటానికి, దేవుడు, మానవత్వంపై మనకు నమ్మకం కలిగించడానికి జన్మించాడు. మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు.
  • ప్రభువు మీ చింతలన్నింటినీ దొంగిలించి, వాటిని సంతృప్తి, ఆనందంతో భర్తీ చేస్తాడు. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
  • ఈ జన్మాష్టమి నాడు, మీ కోరికలన్నీ నెరవేరాలని, నంద గోపాల్ మీకు, మీ ప్రియమైన వారిపై తన ఆశీర్వాదాలను కురిపించాలని కోరుకుంటున్నాను. జన్మాష్టమి శుభాకాంక్షలు.