వ్యాన్​లో హ్యపీ లైఫ్ జర్నీ

వ్యాన్​లో హ్యపీ లైఫ్ జర్నీ

లండన్: హ్యాపీ లైఫ్ గడపాలనుకున్న ఓ జంట.. తమ జర్నీ కోసం తయారు చేయించుకున్న మొబైల్ హోమ్​తో యూకేలో ఫేమస్ అయింది. ఇంగ్లండ్​కు చెందిన టామ్ వార్డ్ (36), అమీ ఓబ్రియన్ (29) హోటల్, పబ్​ను రన్​చేసే వారు. తమ బీజీ లైఫ్​తో విసిగిపోయిన వారు.. ప్రశాంతమైన, ఆనందమయ జీవితాన్ని గడిపేందుకు తమ పెంపుడు కుక్క ఫ్రాంకీతో కలిసి యూకే మొత్తం తిరగాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.20 లక్షలతో ఒక వ్యాన్​ను తమ అవసరాలకు అనుగుణంగా మొబైల్​హోమ్​గా రీమోడలింగ్ చేయించుకున్నారు. ఈ కొత్త మొబైల్ హోమ్‌‌లో బెడ్, గ్యాస్ హబ్, వంటగది, సింక్, ఫ్రిజ్, బాత్​రూమ్, వేడినీళ్ల షవర్, అవుట్‌‌డోర్ షవర్, కంపోస్ట్ టాయిలెట్ వంటి సౌలత్​లు ఉన్నాయి. 

కొన్ని నెలలపాటు ఈ  వ్యాన్లో ప్రయాణించి తమకు నచ్చిన ప్రదేశాలు చూశారు.  మీడియా, సోషల్​మీడియాలో వార్తలు, ఫొటోలతో వీరి మొబైల్​హోమ్ చాలా పాపులరైంది. 2020 మార్చిలో కరోనా మహమ్మారితో యూకే ​చిగురుటాకులా వణికిపోయింది. అదే సమయంలో తన జాబ్, ఫ్లాట్​ను కోల్పోయిన ఓ మహిళ వీరి మొబైల్​హోమ్​ను చూసి తను కూడా ఇలాంటిదే తయారు చేయించుకుంది. ఇప్పుడు ఆమె ఆ మొబైల్​హోమ్​లోనే ఉంటూ వర్క్​ ఫ్రమ్ ​హోమ్ చేస్తోంది. ఆ తర్వాత యూకేలో చాలా మంది ఇలాంటివి తయారు చేయించుకొన్నారు.