దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విషెస్ చెప్పారు. స్థిరమైన భవిష్యత్ కోసం అందరంకలిసి పనిచేద్దామని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో అందరికీ విజయంతో పాటు ఆనందం, ఆరోగ్యం సిరిసంపదలు కలగాలని కోరారు.
న్యూ ఇయర్ లో ప్రతి ఒక్కరు కొత్త అవకాశాలు చేజిక్కించుకుకోవాలన్నారు. కొత్త సంవతర్సం దేశప్రజల్లో అంతులేని ఆనందం నింపాలన్న ప్రధాని మోదీ....సరికొత్త ప్రపంచంలో యువత విజయపథంలో దూసుకెళ్లాలన్నారు. దేశ ప్రజలందరు ఆరోగ్యం, శ్రేయస్సుతో ముందుకుసాగాలన్నారు ప్రధాని మోదీ.