ఐదుగురు సీఎంలు చేయని పని​ రేవంత్ రెడ్డి చేస్తుండు: MP అసదుద్దీన్ ఒవైసీ

ఐదుగురు సీఎంలు చేయని పని​ రేవంత్ రెడ్డి చేస్తుండు: MP అసదుద్దీన్ ఒవైసీ

=  ఓల్డ్​సిటీ వరకు మెట్రో రావడం సంతోషకరం  
=  నాలుగేండ్లలో పనుల్ని కంప్లీట్​చేయండి 
= ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ

హైదరాబాద్: ఎంజీబీఎస్ నుండి చంద్రయాన్ గుట్ట వరకు మెట్రో రైలు రావడం చాలా సంతోషకరమని, ఇప్పటివరకు ఐదుగురు సీఎం వచ్చిన ఎవరూ చేయలేని పని రేవంత్​రెడ్డి చేస్తున్నారని హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ అన్నారు. గత ప్రభుత్వాలు మెట్రోను ఇక్కడి వరకు విస్తరించాలని కనీసం ఇంట్రెస్ట్​కూడా చూపించలేదన్నారు. ఇవాళ హైదరాబాద్​కలెక్టరేట్‎లో మెట్రో రెండో దశలోని కారిడార్​6 విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన 40 మంది నిర్వాసితులకు మెట్రో ఎండీ ఎన్వీఎస్​రెడ్డితో కలిసి చెక్కులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు మెట్రో సేష్టన్​వద్ద వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. రూ. 741 కోట్లతో ఎంజీబీఎస్​నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ జరుగుతుందన్నారు. యుద్దప్రాతిపదికన పనులు చేపట్టి నాలుగేండ్లలో పూర్తి చేయాలన్నారు.  టూరిజం ఉన్న చోట స్కై వాక్​కట్టాలన్నారు.