Happy Valentine's Day 2025 : బ్రేకప్ చెబితే డిప్రెషన్ వద్దు.. కఠిన నిర్ణయాలు వద్దు.. జీవితం చాలా విలువైనది..!

Happy Valentine's Day 2025 : బ్రేకప్ చెబితే డిప్రెషన్ వద్దు.. కఠిన నిర్ణయాలు వద్దు.. జీవితం చాలా విలువైనది..!

తన లవర్ హ్యాండివ్వడంతో జీవితమే వ్యర్థమైందని బాధపడుతుంటారు కొంతమంది. ఇన్నాళ్లూ నేనే తన ప్రాణం అంటూ తిరుగుతారు. ఇప్పుడు వేరే అమ్మాయితో కనిపించాడని బాధపడుతూ తన స్నేహితులతో  తన బాధనంతా చెప్పుకుంటారు. ఇంకొంతమంది లోలోపల మథన పడతారు.  జీవితమంతా కోల్పాయమని ఫీలవుతూ.. ఇక బతకలేరని బాధపడతాతరు. 

 అలాంటి వారు  ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారో అనవసరం.  నువ్వు మాత్రం మేం చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి' అంటారు  అమ్మా నాన్నలు. కొంతమంది అది భరించలేక దుర్వ్యసనాలకు అలవాటు పడతారు. ఇలా ఏవో కారణాల వల్ల ప్రేమ బ్రేకప్ అయి. దాని వల్ల బాధపడుతున్న వాళ్లెందరో ఉన్నారు. 

నాలుగేళ్లపాడు ప్రేమించుకున్న ఓ ప్రేమజంట  అమ్మానాన్నలను ఒప్పించారు.  ఇంతలోనే ప్రియుడికి  యూఎస్ వెళ్లే ఛాన్స్ వచ్చింది. "నువు అబ్రాడ్ వెళ్లడం నాకిష్టం లేదు. అలా అయితే నేను వేరే పెళ్లి చేసుకుంటా అంది  ప్రేమికురాలు.. ఈ విషయాన్ని ప్రియుడు  రెండు వారాల పాటు ఆలోచిం చాడు. తను అబ్రాద్ వెళ్లడం వాళ్ల నాన్ని కోరిక.. కాని తను ఇప్పుడు లేదు. కానీ నాన్న కోరిక తీర్చాలన్న తపన ఉంది. అందుకే ప్రియురాలిని  వేరే పెళ్లి చేసుకోమని చెప్పి తను అబ్రాద్ వెళ్లిపోయాడు. ఆరోగ్యకరమైన బ్రేకప్ అది . అందరూ అలా ఉండాలని రూలేం లేదు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ పరిస్థితులు ముందే ఊహించి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదంటారు సైకాలజిస్ట్  నిపుణులు. 

షార్ట్ ఫిలిం ప్రేమలు 

వాట్సప్ లో ... - ట్విటర్లో .. ఇన్ స్ట్రాగ్రాంలో ఛాటింగ్ తో మొదలైన ప్రేమ నిజ జీవితంలోకి వచ్చేసరికి పర్కవుట్ కాక వీడిపోతారు కొందరు. మరి కొంతమంది పరిస్థితులు అనుకూలించక వాళ్ల ప్రేమ దారులు మార్చుకుంటున్నారు. తరాలు మారే కొద్దీ ప్రేమలో వైఫల్యాలు పెరుగుతూ నే వస్తున్నాయి. మిలీనియం జనరేషన్ లో  ప్రేమలో గెలిచిన వాళ్లకంటే ఓడిన ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లని అడిగితే దానికి కారణం పరిస్థితులే అంటున్నారు. ప్రేమ షార్ట్ ఫిల్మ్ అయినా పర్లేదు కాని 
జీవితం షార్ట్ కాకూడదు. 

అబ్యూజింగ్  రిలేషన్ షిప్ 

ప్రేమలో విఫలం అయ్యేవాళ్లు కొద్ది రోజుల ముందు నుంచే వాళ్ల బంధంలో వచ్చే మార్పులు గమనిస్తుంటారు. వాళ్లు మాన సికంగా దానికి ఎంత వరకూ బాధ్యులో వాళ్లే ఆలోచించుకుంటారు. ప్రేమలో కొంత దూరం ప్రయాణం చేశాక వాళ్ల అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. లేదా బేధాభిప్రాయాలు రావచ్చు దానికి కొన్ని కారణాలుంటాయి.. ఈ విషయంలో  ప్రేమించుకుంటున్న వారు  ఇద్దరికీ సమానంగా బాధ్యతలు ఉంటాయి. 

  • ప్రేమలో ఉన్నప్పుడు కొంతమంది తమ గురించి ఇతరులకు తెలీకూడదు అనుకుం టారు. అలా అబ్బాయి కాని, అమ్మాయి కాని పదిమందిలో తమ పేరును వెల్లడి చేస్తే భరించలేక బ్రేకప్ చేసుకోవచ్చు.
  •  ప్రేమించినప్పుడు సన్నగా ఉంది. రెండేళ్లలో లావైపోయింది. లేదా ప్రేమించినప్పుడు... మంచి ఉద్యోగం ఉంది. పరిస్థితుల కారణంగా అబ్బాయి జీతం తగ్గింది ఇదో కారణం. 
  • బ్రేకప్ కి  ముఖ్యమైన మరో కారణం ఈర్ష...  అబ్బాయిలైనా, అమ్మాయికైనా తమ పార్ట్ నర్  పట్ల ఈర్ష ఉన్నప్పుడు వాళ్లు వేరే వ్యక్తులతో చనువుగా ఉంటే భరించలేరు. 
  • ఒకరి తప్పులు.. ఒకరు ఒప్పు కోకపోడం మరో కారణం. 
  • ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు ఎక్కువ సార్లు వాటిని వాయిదా వేసుకోవడం కూడా అనుమానానికి దారి తీసి బ్రేకప్ వరకూ వెళుతుంది. 
  • కమాండింగ్ గా ఉండటం కూడా తప్పే... అది మీ అవతలి వ్యక్తికి నచ్చకపోవచ్చు. భవిష్యత్తులో ఇదే కొన సాగితే అన్న ఆలోచన వచ్చి బ్రేకప్ చెప్పేలా చేస్తుంది. 
  • అస్తమానం ఒకరి నొకరు నిందించు కోవడం... అరుచుకోవడం ఎక్కువగా  ఉన్నా  ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలిచే అవకాశం ఉండదు.
  • ఒకరికొకరు ఎక్కువ రూల్స్ విధించుకోవడం. 

ఇలా నచ్చకపోతే విడిపోయేందుకు కారణాలు వెతుక్కుంటారు చాలామంది. అలా విడిపోయిన వాళ్లు చచ్చిపోనవసరం లేదు. జీవితం చాలా ఉంది... ప్రేమ ఒక్కటే మీకల కాదు... అమ్మానాన్న మీ కోసం ఎన్నో కలలు కంటుంటారు. అవన్నీ తీర్చాల్సిన బాధ్యత మీకుంటుంది. బాధ్యత కూడిన జీవితం బాధను, ప్రేమను సమానంగా భరిస్తుంది.. 

-వెలుగు,లైఫ్-