దేశ ప్రజలకు మోదీ విజయదశమి శుభాకాంక్షలు

 దేశ ప్రజలకు మోదీ విజయదశమి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేసి జీవితంలో మంచిని అలవర్చుకోవాలనే  సందేశాన్ని ఇస్తుంది.  మీ అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

అటు హోమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు  విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.  అధర్మం అనే అంధకారం ఎంత దట్టమైనా, సత్యం ఆధారమైన ధర్మపు వెలుగు విజయం శాశ్వతం. పాపంపై పుణ్యం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచిన 'విజయదశమి' మనల్ని సదా జ్ఞానమార్గంలో నడపాలని స్ఫూర్తినిచ్చే పండుగ అంటూ  అమిత్ షా ట్వీట్ చేశారు.   చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో ఈరోజు దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.