బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులు

బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులు
  • నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

చేవెళ్ల, వెలుగు: బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధించింది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం బాకాపురం గ్రామానికి చెందిన వడ్డే ప్రకాశ్ 2016లో బాలికను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై అప్పట్లో ఉన్న ఏసీపీ శృత కీర్తి సమక్షంలో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసులో ఆధారాలను పరిశీలించిన రంగారెడ్డి​ జిల్లా కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.