తండ్రి, సవతి తల్లి వేధింపులు.. టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

తండ్రి, సవతి తల్లి వేధింపులు..  టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

మెదక్‌‌‌‌ టౌన్‌‌‌‌, వెలుగు: తండ్రి, సవతి తల్లి వేధింపులు భరించలేక టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్​మండలం జానకంపల్లి గ్రామంలో శనివారం జరిగింది. మెదక్‌‌‌‌ రూరల్‌‌‌‌ సీఐ రాజశేఖర్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దివిటి శ్రావణి (15) మెదక్‌‌‌‌ పట్టణంలోని కస్తూరిబా గురుకులంలో టెన్త్‌‌‌‌ చదువుతోంది. క్రిస్మస్‌‌‌‌ సెలవులు రావడంతో ఇటీవల ఇంటికి వచ్చింది. దీంతో తండ్రి మల్లేశంతో పాటు, సవతి తల్లి జ్యోతి కలిసి శ్రావణిని తిట్టి, కొట్టి వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శనివారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుంది. 

సాయంత్రమైనా ఇంటి తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు అదే గ్రామంలో ఉంటున్న శ్రావణి అక్కలు స్రవంతి, ఆకృతికి సమాచారం ఇచ్చారు. వారి వచ్చి చూడగా అప్పటికే శ్రావణి చనిపోయింది. ‘నా చావుకు తండ్రి మల్లేశం, సవతి తల్లి జ్యోతి వేధింపులే కారణం, నన్ను చంపుతానని బెదిరించారు.. నేను చస్తేనే అందరూ బాగుంటారు’ శ్రావణి రాసిన సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ దొరికింది. స్రవంతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.