పెద్దపల్లి, వెలుగు: ఆన్లైన్లోన్యాప్నిర్వాహకుల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా కేంద్రం చీకురాయి రోడ్డులో ఉంటున్న పల్లె వంశీకృష్ణ (27) అనే సింగరేణి ఉద్యోగి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం..కొన్ని నెలల కింద వంశీకృష్ణ ఓ ఆన్‌లైన్ యాప్లో పలు దఫాల్లో రూ.2.50 లక్షలు లోన్ తీసుకుని గతంలోనే చెల్లించాడు. అయినప్పటికీ అప్పు ఇంకా తీరలేదని వంశీకృష్ణను ఆన్‌లైన్ నిర్వాహకులు వేధిస్తున్నారు.
దీంతో మనస్తాపం చెందిన అతడు గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతుడి ఫోన్స్వాధీనం చేసుకున్నారు. వంశీకృష్ణకు ఇంకా పెండ్లి కాలేదు. కొంతకాలం క్రితమే తండ్రి చనిపోయాడు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేశ్ తెలిపారు.