
నిజామాబాద్ జిల్లా : అధికారపార్టీ నేతల అక్రమాలను బయట పెడుతుండటంతో తనను వేధిస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన యువకుడు నరేష్. తనను విచక్షణారహితంగా కొట్టడమేగాక, తన తల్లిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీఆర్ఎస్ నేతల ప్రొద్భలంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని చెప్పాడు నరేష్.