కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది.. ఓ ప్రైవేటు లా కాలేజీలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అదే కాలేజీలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే నాన్ టీచింగ్ స్టాఫ్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ కొలిపాక వెంకటేశ్వర్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది విద్యార్థిని.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక అందించాలంటూ డిసెంబర్ 11న ఆదేశాలు జారీ చేసింది ఎస్సీ కమీషన్. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొత్తపల్లి పోలీసులు.తన పట్ల వెంకటేశ్వర్లు వ్యవరిస్తున్న తీరును ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.
ఈ ఘటనను పలుమార్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తాను జాతీయ ఎస్సీ కమిషన్ కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది విద్యార్థిని.లైంగిక వేధింపులు తన ఒక్కదానికే పరిమితం కాలేదని.. చాలామంది విద్యార్థినులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొంది విద్యార్థిని.