ఆకతాయిల వేధింపులు: నార్సింగిలో యువతి సూసైడ్

రంగారెడ్డి జిల్లా: ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పుప్పాలగూడకు చెందిన ఈశ్వరమ్మ శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు..  సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశామన్నారు.

స్థానికులు, ఈశ్వరమ్మ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఆకతాయిల బాధ తట్టుకోలేకనే ఈశ్వరమ్మ చనిపోయిందన్నారు. పుప్పాలగూడకు చెందిన నాయక్,  రెడ్యా నాయక్ కొంతకాలంగా ఈశ్వరమ్మను ప్రేమ పేరుతో వేధిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు ఈశ్వరమ్మ బంధువులు. దీంతో నాయక్, రెడ్యా నాయక్ లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు నార్సింగి పోలీసులు.