Harbhajan Singh: ధోనీ ఆటగాళ్లను లెక్కచేయడు.. అతడికంటే రోహిత్ బెస్ట్ కెప్టెన్: హర్భజన్ సింగ్

Harbhajan Singh: ధోనీ ఆటగాళ్లను లెక్కచేయడు.. అతడికంటే రోహిత్ బెస్ట్ కెప్టెన్: హర్భజన్ సింగ్

టీమిండియా బెస్ట్ కెప్టెన్ అనగానే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ లిస్ట్ లో ఉంటారు. వారి వారి శైలిలో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డ్స్ టైటిల్స్ పరంగా చూసుకుంటే  రోహిత్ కంటే ధోనీ టాప్ లో ఉంటాడు. అయితే ఐపీఎల్ విషయానికి వస్తే రోహిత్, ధోనీ సమానంగా నిలుస్తారు. రోహిత్ ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలు అందిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ సైతం 5 ట్రోఫీలు సాధించి పెట్టాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో ధోనీ భారత్ కు టీ20 వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 అందించాడు. వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు ఎదురైంది. హర్భజన్ సింగ్ ఆశ్చర్యకరంగా ధోనీని కాదని రోహిత్ శర్మకు ఓటేశాడు. అంతేకాదు ఈ మాజీ స్పిన్నర్ ధోనీపై చేసిన కామెంట్స్ సంచలంగా మారుతున్నాయి. 

స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన హర్భజన్, ధోని కంటే రోహిత్ ఎందుకు బెటర్ అని వివరించాడు. "రోహిత్ తన ప్రణాళికల గురించి ఆటగాళ్ల వద్ద చర్చిస్తాడు. వారి వద్దకు వెళ్లి తాను చేయాలనుకున్నది చెప్తాడు. దీంతో బౌలర్లకు కావాల్సినంత స్వేచ్ఛ దొరుకుతుంది.కానీ ధోనీ అందుకు భిన్నం. ధోని ఎప్పుడూ ఆటగాడిని తనకు ఏ ఫీల్డ్ కావాలని అడగడు. అతను చెప్పిందే ఫైనల్. ఒక సారి నేను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు శార్దూల్ ఠాకూర్ విషయంలో  నేను ఇచ్చిన సలహా వినలేదు". అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.